IND vs PAK: హై వోల్టేజ్ మ్యాచ్.. హాజరైన మంత్రి లోకేశ్, డైరెక్టర్ సుకుమార్

IND vs PAK: హై వోల్టేజ్ మ్యాచ్.. హాజరైన మంత్రి లోకేశ్, డైరెక్టర్ సుకుమార్

దుబాయి వేదికగా జరుగుతున్న భారత్‌- పాకిస్తాన్ మ్యాచ్‌‌కు తెలుగు ప్రముఖులు బాగానే హాజరయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేశ్, మెగాస్టార్ చిరంజీవి, ఎంపీ కేశినేని చిన్ని, ఫిల్మ్ డైరెక్టర్ సుకుమార్ సహా మరికొందరు సందడి చేశారు. చిరంజీవి సాధారణ డ్రెస్‌లోనే ఉండగా.. లోకేష్, కేశినేని చిన్ని, సుకుమార్, అతని కుటుంబ సభ్యులు టీమిండియా జెర్సీలు ధరించి ఉన్నారు.

250కి అటు.. ఇటుగా..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ మందకొడిగా బ్యాటింగ్‌ చేస్తోంది. 40 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ప్రస్తుతం సల్మాన్ ఆఘా(15), ఖుష్దిల్ షా(8) క్రీజులో ఉన్నారు. ఇంకా 10 ఓవర్ల ఆట మిగిలి ఉంది. పాకిస్తాన్ స్కోర్ 250 వరకు అంచనా వేయొచ్చు. అంతకుముందు 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దాయాది జట్టును కెప్టెన్ రిజ్వాన్‌(46), సౌద్ షకీల్‌(62) గట్టెక్కించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. బాబర్ ఆజాం(23), ఇమామ్‌ ఉల్‌ హక్‌(10) నిరాశ పరిచారు.

ALOS READ | IND vs PAK: దుబాయ్‌లో మెగాస్టార్.. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కు హాజరు