
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నారా లోకేష్ పేరును చేర్చిన సీఐడీ... ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో మోమో దాఖలు చేసింది. దీంతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనపై కేసు నమోదు చేసి విచారణ జరిపేందుకు సీఐడీ సిద్దమవుతోంది.
కాగా ఈ కేసులో చంద్రబాబును ఇప్పటికే సీఐడీ ఏ1గా చేర్చింది. నారాయణను ఏ2గా చేర్చింది. ఇప్పుడు ఇదే కేసులో లోకేష్ ను ఏ14గా చేర్చింది. తమ వ్యక్తిగత ఆస్తుల విలువను పెంచుకోడానికి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని సీఐడీ ఆరోపిస్తోంది.
ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.