జగన్ కు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్..

2024 ఎన్నికల అల్లర్ల కేసులో  అరెస్టైన నిందితుడు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని జైలులో పరామర్శించిన జగన్.. కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్  ట్విట్టర్‌ ద్వారా జగన్ వ్యాఖ్యలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు.డాక్టర్.సుధాకర్ ను చంపింది ఎవరు?ప్రజా వేదికను కూల్చింది ఎవరుని ప్రశ్నించారు.

బీసీ బిడ్డ అమర్నాధ్ గౌడ్ ని చంపింది ఎవరు,ప్రతిపక్ష నేత ఇంటి పై దాడి చేసింది ఎవరు, అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపింది ఎవరు, టిడిపి కార్యకర్త చంద్రయ్య ని చంపింది ఎవరు, 25 లక్షలు ఖర్చు చేసి హెలికాఫ్టర్ లో వెళ్లి మరీ ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని ఓదార్చిన పెత్తందారు సమాధానం చెప్పాలంటూ ట్వీట్ ద్వారా జగన్ కు కౌంటర్ ఇచ్చారు లోకేష్.