స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు విషయంలో ఆయన తనయుడు నారాలోకేష్ కంట తడిపెట్టిన ఘటన చోటు చేసుకుంది. తన తండ్రి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ నాడు తప్పు చేయలేదని... చంద్రబాబు ప్రజల కోసమే నిస్వార్థంగా పని చేశారని అన్నారు. స్కిల్ కేసులోని నిందితులు అందరికీ 38 రోజులకే బెయిల్ మంజూరైతే.. చంద్రబాబుకు రిమాండ్ విధించి 43 రోజులైనా ఇంతవరకు బెయిల్ రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు 43 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తలచుకుంటేనే దు:ఖం తన్నుకొస్తోందన్న నారాలో కేష్ చివరకు తన తల్లి భువనేశ్వరిపై కూడా కేసులు పెడతామని కొంతమంది బెదిరిస్తున్నారని లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు.
Also Read : AMR సంస్థ ఆఫీసు, ఛైర్మన్ మహేష్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు