2024 ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. ఏపీలో జరగనున్న 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ స్థానాల ఎన్నికలకు గాను నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ దాఖలు చేసేందుకు ఏప్రిల్ 18 నుండి 25వరకు వారం రోజులు మాత్రమే గడువు ఉంది. 26న నామినేషన్ల పరిశీలన, 29వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిర్ణయించింది ఈసీ. ఈ క్రమంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తొలిరోజు నామినేషన్ వేయనున్నారు.
మంగళగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న లోకేష్ పీసులువురు నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు. లోకేష్ నామినేషన్ పాత్రలకు టీడీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. నామినేషన్ల పర్వం పారరంభమైన నేపథ్యంలో ఇవాళ్టి నుండి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పై నిషేధం అమల్లోకి రానుంది. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రానే అనుమతించేంచనున్నట్లు తెలిపారు అధికారులు.