తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన అనంతరం లోక్శ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్య త్వం తీసుకున్నారన్నారు. టీడీపీపై ఇక్కడి ప్రజలకు ప్రేమ, ఆశ ఉందని చెప్పారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం అని కొని యాడారు. ఆయనకు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.