ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీకి అధినేత జగన్ అని అన్నారు. వైసీపీ తరుపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక టిడిపి అభ్యర్థులని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి కండువాలు కప్పుతున్నారన్నారు.
‘తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారని భయం. వైసీపీ అభ్యర్ధులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయం. పంచాయతీ ఎన్నికలు పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే టిడిపి అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారు. నువ్వొక నాయకుడివి. నీదొక పార్టీ. అందుకే నిన్ను పిరికివాడు అనేది‘ అంటూ ట్విట్టర్లో విమర్శించారు లోకేష్.
తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారని భయం. వైసీపీ అభ్యర్ధులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయం. పంచాయతీ ఎన్నికలు పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు.(2/3)
— Lokesh Nara (@naralokesh) February 28, 2021