చంద్రబాబు, జగన్ లపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..

ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ల తొలి పర్యటనను పోల్చుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. నాయకుడు, ప్రతినాయకుడు అంటూ లోకేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు లాంటి నాయకుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తే, అధికారులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులతో సమావేశం అవుతారని, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు పై చర్చ. ప్రధానిని కలిసి చర్చిస్తారని పేర్కొన్నారు లోకేష్.

ప్రతినాయకుడు తొలిసారి జిల్లా పర్యటనకు వెళ్లి అక్రమాలు, అరాచకాలలో ఆరితేరి, పల్నాడును రావణకాష్టం చేసి, చివరకు పాపం పండి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించారని, ఎన్నికల ఫలితాల తరువాత మాజీ సీఎం నెల్లూరు జిల్లా జైలుకు తొలి పర్యటన ప్లాన్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు లోకేష్.