సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న నారాలోకేశ్

సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న నారాలోకేశ్

 సింహాద్రి అప్పన్న (Simhaadri Appanna) స్వామిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న లోకేష్.. బేడ మండపం వద్ద ప్రదక్షిణ చేశారు. అనంతరం అంతరాలయంలోని స్వామి వారిని లోకేష్ దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం అధికారులు లోకేష్‌కు స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. లోకేష్‌తోపాటు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, పల్లా శ్రీనివాస్, అదితి గజపతి, పీవీ నరసింహం, టీడీపీ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. 

శంఖారావం యాత్రలో ... లోకేశ్ శనివారం ( ఫిబ్రవరి 17)  విశాఖపట్టణం జిల్లా పెందుర్తి మండలంలోని కృష్ణరాయపురం, భీమిలి నియోజకవర్గ పరిధిలోని చిట్టివలస, విజయనగరం జిల్లా సోంపురంలో పర్యటించి వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఏపీకి రాజధాని పేరుతో జగన్ మూడు ముక్కలాటలాడారని మండిపడ్డారు. విశాఖలో రాజధాని పేరుతో వేల కోట్లు విలువ చేసే భూములు కొట్టేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రాను మూడు కుటుంబాలకు దారాదత్తం చేశారని విమర్శించారు.