పులివెందుల ప్రజలు కూడా జగన్ బాధితులే.. కార్యకర్తలతో నారా లోకేష్

కడప జిల్లాలో యువగళం కొనసాగిస్తున్న నారాలోకేష్ పులివెందులలో టీడీపీ కార్యకర్తలతో, స్థానిక నేతలతో సమావేశమయ్యారు. వైసీపీ పాలనలో విపరీతంగా పన్నులు పెంచి ప్రజలను పీడిస్తున్నారని లోకేష్ ఆవేవన వ్యక్తం చేశారు.  పులి వెందుల ప్రజలు కూడా జగన్ బాధితులే అన్న ఆయన.. టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి  అనే కార్యక్రమాలు పులివెందులలో అనుకున్న స్థాయిలో జరగలేదన్నారు. ప్రజా సమస్యల పై పోరాడినప్పుడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారని లోకేష్ అన్నారు. కేసులకు భయపడి ఇంట్లో పడుకుంటామంటే ప్రజలు హర్షించరన్నారు. పోరాడిన వారికే ప్రజల మద్దతు ఉంటుందన్నారు. భవిష్యత్తు కి గ్యారెంటీ కార్యక్రమం పులివెందుల లో పక్కగా నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. కడప జిల్లా లో టిడిపి కి పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. దానిని నాయకత్వం అందిపుచ్చుకోవాలని నారాలోకేష్ అన్నారు..

పులివెందులలో గెలవకపోయినా ఎప్పుడూ చిన్న చూపు చూడలేదన్న లోకేష్.. అన్ని నియోజకవర్గాల మాదిరిగానే పులివెందులను కూడా అభివృద్ది చేశామన్నారు. 90 వేల మెజారిటీ లో గెలిపించినందుకు జగన్ పులివెందులకు ఏమి చేశారని ప్రశ్నించారు.  ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతికి, వర్ధంతికి పులివెందుల రావడంతప్ప  ఏమీ చేయలేదన్నారు.  ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడు? రోడ్లు వేసాడా? కోట్ల రూపాయలు మంజూరు చేశాను అంటున్నాడు. ఒక్క రూపాయి విడుదల చేసాడా? అని వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

పులివెందుల లో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్న లోకేష్  . సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ఏమి జరగడం లేదన్నారు. నాడు - నేడు పేరుతో హడావిడి తప్ప పులివెందుల స్కూళ్ల లో కనీసం మౌలిక వసతులు లేవన్నారు . వందల కోట్ తో రోడ్ల నిర్మాణం కోసం జగన్ శంకుస్థాపన చేశాడు కాని   ఒక్క రోడ్డు కూడా పూర్తి చెయ్యలేదన్నారు. . పంచాయతీ రాజ్ శాఖ అధ్వర్యంలో వేయాల్సిన రోడ్లు ఎందుకు  పూర్తి కాలేదని ప్రశ్నించారు.