
బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రం జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో నారా నందమూరి కుటుంబ సభ్యులు డాకు మహారాజ్ సినిమాను చంద్రగిరి ఎస్వీ సినిమాస్లో తిలకించింది. వారిలో బాలకృష్ణ అల్లుడు ఏపీ మంత్రి నారా లోకేష్, కుమార్తెలు బ్రహ్మణి, తేజస్వి ఉండగా..వారితో పాటు ఎంపీ శ్రీ భరత్, నందమూరి రామకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం నారా నందమూరి ఫ్యామిలీస్ డాకు మహారాజ్ చూస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. తొలిరోజు (జనవరి 12న) రూ.56 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. డాకు మహారాజ్ మూవీ మొత్తంగా ఇండియాలో రూ. 80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.82 కోట్ల షేర్ రాబట్టాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 67కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్.
చంద్రగిరి ఎస్వీ సినిమాస్ లో డాకు మహారాజ్ సినిమాను తిలకించిన మంత్రి నారా లోకేష్ గారు, ఎంపీ శ్రీ భరత్ గారు, తేజస్విని గారు , బ్రహ్మణి గారు, నందమూరి రామకృష్ణ గారు మరియు నారా నందమూరి కుటుంబ సభ్యులు #DaakuMaharaaj #BlockBusterDaakuMaharaaj #NandamuriBalakrishana #NaraLokesh #TDP pic.twitter.com/j12tK95iZG
— ᴹᵃʰᵃʳᵃᵃʲ Balayya Yuvasena (@BalayyaUvasena) January 13, 2025