ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం..

తెలుగులో సోలో, ప్రతినిధి తదితర చిత్రాల్లో హీరోగా నటించి అలరించిన టాలీవుడ్ ప్రముఖ హీరో నారా రోహిత్ శిరీష లెల్లని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఆదివారం (అక్టోబర్ 13) ఘనంగా నిర్వహించారు. ఇందులోభాగంగా హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దంపతులు, బంధువులు తదితరులు హాజరై నూతన వధూవరులకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నారా రోహిత్ కి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఈ ఎంగేజ్మెంట్ అనంతరం డిసెంబర్‌ 15న వీళ్లిద్దరిపెళ్లికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నారా రోహిత్ ప్రతినిధి 2 చిత్రంలో హీరోగా నటించాడు. కానీ ఈ చిత్రం ఆడియన్స్ ని పెద్దగా అలరించలేక పోయింది. ప్రస్తుతం నారా రోహిత్ తెలుగులో సుందరకాండ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకటేశ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.