టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohith) చాలా గ్యాప్ తరువాత చేస్తున్న మూవీ ప్రతినిధి 2(Prathinidhi 2). ఆయన కెరీర్ లో మంచి విజయం సాధించిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా వస్తన్న ఈ సినిమాను ప్రముఖ జర్నలిస్టు మూర్తి(Murthy) తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుత సమకాలిన రాజకీయ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటామనే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సినిమాలో హీరో రోహిత్ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నాడని అర్థమవుతోంది. అభివృద్ధి.. అదెక్కడ ఉంటుంది సార్, బయటకు వచ్చి ఓటు వేయండి, లేకుంటే చచ్చిపోండి అని రోహిత్ చెప్పిన డైలాగులు కూడా ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా ఉన్నాయి.
దీంతో ప్రతినిధి 2 టీజర్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి చాలా గ్యాప్ తరువాత పొలిటికల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రోహిత్ కు ప్రతినిధి 2 సినిమా ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.