చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగాలి: నరహరి

మంచిర్యాల, వెలుగు: జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరముందని మధ్యప్రదేశ్​ ప్రభుత్వ ప్రిన్సిపల్​సెక్రటరీ, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఐఏఎస్ పరికిపండ్ల నరహరి అన్నారు. తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాలలోని ఓ ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన బీసీల అలయ్ బలయ్​ కార్యక్రమానికి ఆయన చీఫ్ ​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. మంచిర్యాల నియోజకవర్గంలో మెజారిటీ బీసీలున్నప్పటికీ ఎన్నికల్లో ఆ వర్గానికి టికెట్లు రావడం లేదన్నారు.

ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చి చట్టసభలకు పంపాలని కోరారు. తెలంగాణ బీసీ జాగృతి రాష్ట్ర నాయకులు నరెడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయం ఫౌండేషన్​డిప్యూటీ సీఈవో రాజేంద్రకుమార్, మున్సిపల్​వైస్​ చైర్మన్​గాజుల ముఖేశ్​ గౌడ్, డాక్టర్లు పి.రమణ, బి.రఘునందన్, నీలకంఠేశ్వర్​గౌడ్, కర్రె లచ్చన్న, నీలి శ్రీనివాస్, జోగుల శ్రీదేవి, బీసీ జాగృతి టౌన్​ప్రెసిడెంట్​వైద్య భాస్కర్, వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొట్టల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.