నరాలి పూర్ణిమ.. ఈ పండుగను రాఖీ రోజునే ఎందుకు జరుపుకుంటారంటే..

భారతదేశంలో నరాలి పూర్ణిమ లేదా రాఖీ పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఒకే రోజున ఈ రెండు పండుగలు జరుపుకుంటారు. నరాలి పూర్ణిమ వర్షాకాలం మొదటి రోజును జరుపుకుంటుంటారు. అయితే రాఖీ అనేది సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు, రక్షకు ప్రతీకగా జరుపుకునే పండుగ.

నరాలి పూర్ణిమ పండుగ పంట కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. సమృద్ధి, శ్రేయస్సుకు ఈ కాలం ప్రతిబింబిస్తుంది. అందుకే భారతదేశంలో, ముఖ్యంగా కొంకణ్ ప్రాంతాలలో దీన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వర్షాలు సమృద్ధిగా కురిసి సమృద్ధిగా పంటలు పండాలని, నీటి దేవుడైన వరుణుడిని ప్రార్థించడం ద్వారా ఈ పండుగను జరుపుకుంటారు.

ALSO READ :వెస్ట్ బెంగాల్ లో రెచ్చిపోయిన బీహార్ దొంగలు: ఐదుగురు అరెస్ట్ 

మరోవైపు అన్నదమ్ముల బంధాన్ని చాటే పండుగ రాఖీ. సోదరీమణులు తమ సోదరుల మణికట్టు చుట్టూ పవిత్రమైన దారాన్ని కట్టి, వారి దీర్ఘాయువు, శ్రేయస్సు, ఆనందం కోసం ప్రార్థిస్తారు. బదులుగా, సోదరులు వారికి బహుమతులు ఇస్తారు, అన్ని పరిస్థితులలో వారిని కాపాడతారని వాగ్దానం చేస్తారు.

దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో నరాలి పూర్ణిమను అవని అవిట్టం అంటారు. అయితే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో దీన్ని కజ్రీ పూర్ణిమ అని పిలుస్తారు. ఈ సంవత్సరం రక్షా బంధన్ మాదిరిగానే నరాలి పూర్ణిమ ఆగస్టు 30న వస్తుంది. ఈ రోజున, భారతదేశంలోని ప్రజలు వరుణుని ఆశీర్వాదం, పంట కాలంలో సమృద్ధిగా వర్షాలు కురిపించమని ప్రార్థిస్తారు. వారు తమ తోబుట్టువులతో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సోదర-సోదరీ బంధానికి చిహ్నంగా వారి మణికట్టు చుట్టూ పవిత్రమైన దారాలను కట్టుకుంటారు.

ఈ రెండు పండుగలను కలిసి జరుపుకోవడం ద్వారా, తోబుట్టువులు ఒకరికొకరు దగ్గరవుతారు. ప్రేమ, రక్షణతో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. కావున మీరు మీ తోబుట్టువులతో మీ రిలేషన్షిప్ ను సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నట్లయితే, నరాలి పూర్ణిమను సైతం మిస్ చేసుకోకండి.