నరనారాయణ జాతర ప్రారంభం

జన్నారం, వెలుగు: జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని నరనారాయణ స్వామి దేవస్థానం 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జాతర ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా మొదటి రోజు మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. శనివారం దేవస్థానంలో యజ్ఞం, ఆదివారం స్వామివారి రథోత్సవంతో జాతర ముగుస్తుందని ఆలయ కమిటీ చైర్మన్ స్వదేశ్ రావు తెలిపారు. కుంకుమ పూజల్లో ఆలయ కమిటీ సభ్యులు కిషన్ గౌడ్, అంజగౌడ్, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.