గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. పోలింగ్ కేంద్రాలను సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న నేతలపై ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కవ్వింపు చర్యలు దిగుతున్నారు. ఇది పరిస్థితిని హీటెక్కిస్తోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఆయన కార్లను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారుల పైకి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు.అయితే వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.