నరసరావుపేటలో ఉద్రిక్తత.. ఉద్యోగులను ఎమ్మెల్యే గోపిరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపణ

పల్నాడు జిల్లా నరసరావు పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. SSN కాలేజీ పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పోస్టల్​ బ్యాలెట్​ ఉపయోగించుకుని ఓటు వేసేందుకు వస్తున్న ఉద్యోగులను వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి  అనుచరులు ఓటు వేసే ఉద్యోగస్తులను బెదిరిస్తున్నారని   ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ఈ క్రమంలో టీడీపీ నేతలకారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలింగ్​ కేంద్రం వద్ద బందోబస్తు కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఓటర్లు ఆరోపిస్తున్నారు.  విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.