హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో యువకుడికి మద్యం తాగించి చంపేందుకు ప్రయత్నించారు. అక్కన్నపేట ఎస్సై వివేక్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడాటిపల్లికి చెందిన బైరి నరసింహ, హుస్నాబాద్ కు చెందిన సంగ విక్రమ్ ఆదివారం మధ్యాహ్నం నుంచి కలిసి మద్యం తాగుతున్నారు. సాయంత్రం కావడంతో విక్రమ్ ను నరసింహ జనగామ శివారులోని కంకర క్వారీ సమీపంలోకి తీసుకెళ్లాడు. రాత్రి 9.30 గంటలదాకా అక్కడే తాగారు.
ALSOREAD:భూకబ్జాలు తప్ప అభివృద్ధి పట్టని ముత్తిరెడ్డి..మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి
ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవ పెట్టుకున్నారు. నరసింహ తన వెంట తెచ్చుకున్న కత్తితో విక్రమ్ మెడపై, తలపై పొడిచాడు. దీంతో విక్రమ్ మాలపల్లి శివారువైపు పారిపోయాడు. అటుగా బైకుపై వస్తున్న ఓ వ్యక్తిని లిఫ్టు అడిగి హుస్నాబాద్ వెళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి అన్న రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.