గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర మినిమమ్వేజ్అడ్వయిజరీ బోర్డు మెంబర్(ట్రేడ్ యూనియన్ ప్రతినిధి)గా సింగరేణి కోల్మైన్స్లేబర్యూనియన్(ఐఎన్టీయూసీ) సెంట్రల్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ఎస్.నర్సింహారెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి కృషి చేసిన మంత్రి శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నర్సింహరెడ్డిని యూనియన్ ప్రతినిధులు ఎండీ అక్రమ్, ఆరెపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ, ఎట్టం కృష్ణ, వెంకటేశ్వర్లు, అల్లావుద్దీన్, మహేశ్, తదితరులు సన్మానించారు.