మూడు రోజుల్లోరెండు పార్టీలు మారిన పెద్దపల్లి జిల్లా నరసయ్యపల్లి నేత

సుల్తానాబాద్, వెలుగు:ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కండువాలు వేగంగా మారుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లి గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు జూపల్లి తిరుమల్ రావు బుధవారం పీసీసీ ఉపాధ్యక్షుడు విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. అయితే, ఆ పార్టీలో చేరిన 48 గంటల్లోపే అయన కండువా మార్చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు. ఈ పరిణామాలు మండలంలో చర్చనీయాంశంగా మారాయి.