విజయ్ హజారే ట్రోఫీలో తమిళ నాడు ఓపెనర్ నారాయణ్ జగదీశన్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఒకే ఓవర్ లో ఆరు ఫోర్లు కొట్టి సంచలన బ్యాటింగ్ తో మెరిశాడు. రాజస్థాన్ తో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో షెకావత్ బౌలింగ్ లో జగదీశన్ ఈ ఘనత సాధించాడు. తొలి బంతిని థర్డ్ మ్యాన్ దిశగా.. రెండో బంతిని పాయింట్ దిశగా ఫోర్ కొట్టాడు. మూడు, నాలుగు బంతులను కూడా వరుసగా థర్డ్ మ్యాన్, పాయింట్ దిశగా బౌండరీలు బాదాడు. ఐదో బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా.. చివరికు బంతిని స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ బాదాడు.
అంతకముందు షెకావత్ తొలి బంతిని వైడ్ వేయగా అది ఫోర్ వెళ్ళింది. దీంతో ఈ ఓవర్ లో మొత్తం 29 పరుగులు వచ్చాయి. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 10 ఫోర్లతో 65 పరుగులు చేసి జగదీశన్ ఔటయ్యాడు. తన తొలి ఓవర్ లోనే 29 పరుగులు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత షెకావత్ పుంజుకున్నాడు. ఆ తర్వాత మొత్తం 7 ఓవర్లు వేసి 30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షెకావత్ తో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో ఈ మ్యాచ్ లో తమిళ నాడు పై రాజస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ALSO READ | BRSAL vs RAR: ఛేజింగ్‌లో సంచలనం.. చివరి ఓవర్‌లో 30 పరుగులు కొట్టి గెలిసిపించిన నురుల్
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులు ఆలౌట్ అయింది. అభిజీత్ తోమర్ 111 పరుగులు చేసి జట్టుకు డీసెంట్ టోటల్ అందించాడు.కెప్టెన్ లోమరోర్ 60 పరుగులు చేసి రాణించాడు. తమిళ నాడు బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి 5 వికెట్లు తీసుకొని చెలరేగాడు. 268 పరుగుల లక్ష్య ఛేదనలో తమిళ నాడు 248 పరుగులకు ఆలౌట్ అయింది. జగదీశన్, విజయ్ శంకర్ రాణించినా మిగిలిన విఫలమయ్యారు.
NARAYAN JAGADEESAN SMASHED 6 FOURS IN AN OVER. pic.twitter.com/KAgXSi37Kt
— KnightRidersXtra (@KRxtra) January 9, 2025