
భైంసా/లోకేశ్వరం, వెలుగు : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీమ్‌లతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆ పార్టీ ముథోల్అభ్యర్థి నారాయణ్‌రావు పటేల్ అన్నారు. గురువారం లోకేశ్వరం మండల కేంద్రంలో పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణను చూసి బీఆర్ఎస్, బీజేపీలు తట్టుకోలే అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు.
తొమ్మిదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న విఠల్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఒక్క అవకాశమిస్తే ముథోల్నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతానన్నారు. లీడర్లు ఆనంద్‌రావు పటేల్, భీంరావు, అంజద్తో పాటు కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.