- శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ రూ.కోటి విరాళం అందజేత
హైదరాబాద్, వెలుగు: వరద బాధితుల సహా యం కోసం సీఎం సహాయనిధికి నారాయణ విద్యా సంస్థలు రూ.2.5 కోట్ల విరాళం ప్రకటించాయి. విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర శరణి, ఈడీ పునీత్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. అలాగే, శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ రూ.కోటి విరాళం ఇచ్చింది. శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వైఎస్ చక్రవర్తి సీఎం రేవంత్‌ను కలిసి చెక్కును అందిం చా రు.
మోల్డ్ టెక్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రూ.25 లక్షల చెక్కును సీఎంఆర్ఎఫ్కు ఇచ్చారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మ న్ వై.శోభ సీఎం రూ.50 లక్షల చెక్కును అందించారు. టెక్నో పెయింట్స్ రూ.20 లక్షలు, కుమారీ ఆంటీ రూ.50వేలు అందజేశారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెనార్స్ ఆఫ్ ఇండియా సీఎంఆర్ఎఫ్కు రూ.5 లక్షల రూపాయల విరాళం అందించింది.