
హైదరాబాద్ సిటీ, వెలుగు: నేషనల్ స్పేస్సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ‘లివ్ ఇన్ హెల్తీ స్పేస్ కాంటెస్ట్–2024’లో నారాయణ కాన్సెప్ట్స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. నాసా ప్రోత్సహంతో నిర్వహించిన ఈ పోటీల్లో వరల్డ్‌నంబర్–1 స్థానంలో నాలుగు సెలక్షన్స్‌ను నారాయణ విద్యార్థులు దక్కించుకున్నారు.
వరల్డ్ నెంబర్–2 స్థానంలో బీ, వరల్డ్ నెంబర్–3లో 9 సెక్షన్లతో పాటు 32 బహుమతులను కైవసం చేసుకున్నారని నారాయణ విద్యార్థుల మేనేజింగ్ డైరెక్టర్లు డా. సింధూర నారాయణ, డా. శరణి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ 3ఎ బహుమతుల్లో ఎస్‌బీడీ జోన్ నారాయణ హైస్కూల్మల్కాజిగిరి బ్రాంచ్ విజయం సాధించిందన్నారు. ఎజీఎం పురుషోత్తంరెడ్డి, ఆర్ఎన్ఓ హెడ్శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్పద్మలత, కోఆర్డినేటర్ కిరణ్, అకాడమిక్ డీన్ మమత, నాసా ఇన్చార్జి మోనిక ప్రోత్సాహంతో విద్యార్థులు వికాస్సాయి, జీవన్‌రెడ్డి, తమన్గుప్తా, సుషాన్, హర్షవర్ధన్ బహుమతులను గెలుపొందారని తెలిపారు.