నీట్–2022 ఫలితాల్లో నారాయణ విద్యార్థుల హవా

నీట్–2022 ఫలితాల్లో నారాయణ విద్యార్థుల హవా

హైదరాబాద్, వెలుగు: నీట్–2022 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు తమ హవా కొనసాగించారు. ఓపెన్ కేటగిరీలో తమ విద్యార్థి తనిష్క ఆలిండియా టాపర్​ గా నిలిచారని, వివిధ కేటగిరీల్లో 1,1,1,2,2,9 వంటి ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.శరణీ నారాయణ, సింధూర నారాయణ గురువారం తెలిపారు. టాప్​ 10లో 6 ర్యాంకులు, వందలోపు 29 ర్యాంకులు, వెయ్యిలోపు 324 ర్యాంకులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించామని చెప్పారు. స్టార్ సీఓ బ్యాచ్, ఎన్​–40 ప్రోగ్రామ్ ల ద్వారా టాప్ ర్యాంకులు సాధిస్తున్నామన్నారు.

సీబీఎస్ఈ బయోలజీలో తెలుగు విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా, ఫిజిక్స్,  కెమిస్ర్టీల్లో సీబీఎస్ఈ తయారు చేసే క్వశ్చన్ పేపర్లకు అనుగుణంగా అకాడమిక్ ప్రోగ్రామ్​లను తయారు చేస్తున్నట్టు తెలిపారు. కాన్సెప్ట్స్​ బెస్డ్ విద్యావిధానాన్ని పరిగణనలోకి తీసుకోవడంతోనే టాప్​ర్యాంకులు సాధించినట్టు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో  మొదటిసారిగా మూడుసార్లు ఏఐపీఎంటీ ఆలిండియా ఫస్ట్ ర్యాంక్​  సాధించిన ఘనత ఒక్క నారాయణ విద్యాసంస్థదేనని అన్నారు. ర్యాంకులు సాధించిన స్టూడెంట్లు, వారి పేరెంట్స్, లెక్చరర్లకు అభినందనలు చెప్పారు.