- పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ అడిక్షన్ పై చర్చ
హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన నారాయణ విద్యాసంస్థలు.. ‘డిజిటల్ డిపెండెన్సీ అండ్ అడిక్షన్’ పేరుతో గైడ్ కాస్ట్ 4వ ఎపిసోడ్ ను యూట్యూట్ వేదికగా విడుదల చేసింది. ఈ ఎపిసోడ్ పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ డిపెండెన్సీ సమస్యపై, వారి మానసిక, భావోద్వేగ పరిస్థితులపై పడుతున్న ప్రభావాల గురించి చర్చించింది. ఎక్కువ టైమ్ డిజిటల్ వినియోగంతో అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందనే విషయాన్ని పేరెంట్స్ కు తెలియజేయడమే గైడ్ కాస్ట్ ముఖ్య ఉద్దేశ్యమని నారాయణ గ్రూపు ఎండీలు సింధూర నారాయణ, శరణీ నారాయణ తెలిపారు.
ఎక్కువ సేపు స్క్రీన్ చూడటంతో డిజిటల్ వ్యసనానికి దారి తీస్తోందని, తద్వారా పిల్లల్లో మానసిక సామాజిక ఎదుగుదల తగ్గుతుందని కలిగిస్తోందని చెప్పారు. పిల్లలు డిజిటల్ పరికరాలకు అతుక్కుపోవటంతో తీవ్రమైన ఆందోళనకు దారితీయటంతో పాటు నిద్రకు అంతరాయం కలిగిస్తుందని వివరించారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లు, టీవీలకు ఎక్కువ సమయం కేటాయించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.