నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాకు సాగునీటిని అందించే జీవో 69ని త్వరగా అమలు చేయాలని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి శివకుమార్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. సోమవారం సెక్రటేరియేట్‌లో సీఎంను కలిసి విన్నవించారు.
అసెంబ్లీలో 69 జీవో అంశాన్ని ప్రస్తావించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పరిపాలన సౌలభ్యం కోసం నియోజకవర్గంలో కాన్కుర్తి, గర్లపాడు, కోటకొండ మండలాలను ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణ రావు, పొన్నం ప్రభాకర్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.
కల్వకుర్తి: కల్వకుర్తి అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు ఆశాదీపు రెడ్డి సీఎంను కోరారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. తాండ్ర గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని సీఎంకు వివరించారు.