రాష్ట్ర హ్యాండ్లూమ్ డైరెక్టర్ అలుగు వర్షిని
నారాయణపేట, వెలుగు : ప్రపంచవ్యాప్తంగా నారాయణపేట పట్టు చీరలు మరింత ప్రసిద్ధి చెందేలా చేనేత కార్మికులు కృషి చేయాలని రాష్ట్ర హ్యాండ్లూమ్ డైరెక్టర్ అలుగు వర్షిని అన్నారు. గురువారం పట్టణ చేనేత కార్మికుల స్థితిగతులు, సొసైటీల నిర్వహణపై కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో కలెక్టర్ శ్రీహర్ష తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంచీపురంలో పట్టు చీరల శిక్షణకు కార్మికులను పంపుతామని తెలిపారు.
సొసైటీలలో కార్మికులు సభ్యత్వం కలిగి తీసుకోవాలన్నారు. నారాయణపేట ట్రెడిషనల్ చీరలను పరిశీలించారు. అనంతరం మగ్గాలను, హ్యాండ్లూమ్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లాలో ఏడు చేనేత సొసైటీలలో మూడు పనిచేయడం లేదని ఆమెకు అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, ఏడీ దాసరి బాబు, డీవో చంద్రశేఖర్, మాస్టర్ వీవర్లు శ్రీనివాస్, కాసరగు, గణప, రఘురాములు, ప్రభాకర్, నరసింహులు, సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.