పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడిస్తరు ?..సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌ వద్ద నారాయణపురం రైతుల ధర్నా

పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడిస్తరు ?..సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌ వద్ద నారాయణపురం రైతుల ధర్నా
  • గ్రామం మొత్తాన్ని ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌లో కలిపేసిన ఆఫీసర్లు
  • ఏడేండ్లుగా ఇబ్బందులు పడుతున్న 700 మంది రైతులు
  • రైతులతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీకి ఆదేశం 

మహబూబాబాద్, వెలుగు : ఆఫీసర్ల నిర్లక్ష్యం ఓ గ్రామం మొత్తాన్ని ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌లో కలిపేసింది. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులకు పట్టాదార్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ జారీ నిలిచిపోయింది. పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో సుమారు 700 మంది రైతులు రైతు భరోసా, రైతు భీమా వంటి ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని ఎన్నిసార్లు ఆఫీసర్ల చుట్టూ తిరిగినా వారి నుంచి స్పందన కరువైంది. విసుగు చెందిన రైతులు సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చేరుకొని సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌ వద్ద ఆందోళనకు దిగారు.

రెవెన్యూ ప్రక్షాళన నుంచే ఇబ్బంది...

ఏడేళ్ల కింద అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. ఈ టైంలో మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలోని 1,827 ఎకరాలను ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ భూమి కింద చూపించి రైతులకు పట్టాదార్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ జారీని నిలిపివేశారు. ఆ తర్వాత తీసుకొచ్చిన ధరణి వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లోనూ ఈ ఊరి పేరు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన రైతులు పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బాటిల్స్‌‌‌‌‌‌‌‌తో నిరసనలు, ర్యాలీలు, రిలే దీక్షలు, రాస్తారోకోలు, కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌, సీసీఎల్‌‌‌‌‌‌‌‌ఏ ముట్టడి కార్యక్రమాలు చేపట్టడంతో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను నిలదీశారు.

దీంతో స్పందించిన రెవెన్యూ ఆఫీసర్లు ఎంజాయ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సర్వే చేయడంతో పాటు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా 500 మందికి చెందిన 720 ఎకరాల భూమిని 2022 ఆగస్ట్‌‌‌‌‌‌‌‌లో ధరణిలో పొందుపరిచి పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ అందజేశారు. కానీ నారాయణపురం గ్రామానికి చెందిన సర్వే నంబర్లను పక్కనే ఉన్న నెల్లికుదురు మండలం చిన్నముప్పారం గ్రామంలో ఉన్నట్లు చూపారు. దీంతో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో ఆఫీసర్లు మరోసారి సర్వే నిర్వహించి ఈ సర్వే నంబర్లను నారాయణపురానికి సంబంధించినవేనని తేల్చి పాస్‌‌‌‌‌‌‌‌ బుక్స్‌‌‌‌‌‌‌‌ అందజేశారు.

ఎదురుచూపుల్లో మరో 700 మంది రైతులు

 నారాయణపురం గ్రామంలోని 1,127 ఎకరాలకు సంబంధించిన మరో 700 మంది రైతుల వివపావను ఇప్పటివరకు ధరణిలో పొందుపరచలేదు. తమ సమస్యను పరిష్కరించాలని ఆఫీసర్ల చుట్టూ తిరగడంతో అప్పటి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ శశాంక ఎంజాయ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సర్వే చేసి ఆ రిపోర్టుతో పాటు, ఇతర మండలాలతో ఉన్న బార్డర్‌‌‌‌‌‌‌‌  సమస్యలను రెక్టిఫై చేసిన రిపోర్టును 2022 ఆగస్టు 23 సీసీఎల్‌‌‌‌‌‌‌‌ఏ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు పంపించారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో రైతుల సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రస్తుతానికి నేచర్ ఆఫ్ ల్యాండ్

క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ స్థానాల్లో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌కు బదులు పట్టా భూమిగా మార్పులు చేసినప్పటికీ, రైతులకు పూర్తిస్థాయిలో పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ అందలేదు. వారి వివరాలు ధరణిలో కనిపించడం లేదు. పట్టాదార్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో రైతులు రైతు భరోసా, రైతు భీమాతో పాటు పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌ పథకానికి దూరం అవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా  స్పందించి తమకు పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని కోరుతున్నారు.

సెక్రటేరియట్ వద్ద ఆందోళన

తమ సమస్యను పరిష్కరించాలంటూ నారాయణపురం గ్రామానికి చెందిన 60 మంది రైతులు సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌ వద్ద ఆందోళనకు దిగారు. తమకు కొత్త పట్టాదార్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌పుస్తకాలు జారీ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆఫీసర్లు సమస్యను తెలుసుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డిని రైతులు కలిసేలా ఏర్పాటు చేశారు. వారి సమస్యను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ధరణి వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో ‘రైతు పేరు అడవి, భూమి విస్తీర్ణం అడవి’గా ఉందని రైతులు చెప్పడంతో వెంటనే రెవెన్యూ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ నవీన్‌‌‌‌‌‌‌‌ మిట్టల్‌‌‌‌‌‌‌‌ను పిలిపించి వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.