మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : సంజీవరెడ్డి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ లో మహిళా నాయకులను, వివిధ శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలువిద్యా అవకాశాలు మెరుగుపరుచుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఎమ్మెల్యే సతీమణి అనుపమ సంజీవరెడ్డి, ఎంపీపీలు చాంది భాయ్, మోతీబాయ్, సర్పంచ్​లు పల్లవి, స్వప్న, ఉద్యోగులు జ్యోతి, వాణి, అపర్ణ, జయశ్రీ, టీచర్లు, అంగన్​వాడీ కార్యకర్తలు  పాల్గొన్నారు.