నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ నియోజకవర్గంలో రోడ్ల కనెక్టివిటీ పెంచి అభివృద్ధిని వేగవంతం చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గం కర్నాటక, మహారాష్ట్ర బార్డర్లో ఉండటంతో బార్డర్ రోడ్లను డెవలప్మెంట్ చేయడంతోపాటు, స్టేట్, నేషనల్ హైవే లను లింక్ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడి ప్రపోజల్ సిద్ధం చేశామని తెలిపారు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడగా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్ కల్ మండలం వరకు విస్తరించనున్న నిమ్జ్ ను కనెక్టివిటీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే నారాయణఖేడ్–బీదర్ నేషనల్ హైవే పనులు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో రోడ్ల విస్తరణకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ దారం శంకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.