కర్ణాటక ధాన్యం జిల్లాలోకి రానీయొద్దు : కలెక్టర్ సిక్తా పట్నాయక్

కర్ణాటక ధాన్యం జిల్లాలోకి రానీయొద్దు : కలెక్టర్ సిక్తా పట్నాయక్
  • బార్డర్ చెక్‌‌‌‌‌‌‌‌పోస్టును తనిఖీ చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ 

మాగనూర్, వెలుగు : కృష్ణా మండలం బార్డర్ చెక్ పోస్ట్ ను మంగళవారం నారాయణ పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు.  కర్ణాటక ధాన్యం మన జిల్లాలోకి రాకుండా చెక్ పోస్ట్ వద్ద నిఘా పెట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి ఇస్తున్న రూ. 500 బోనస్ మన రైతులకే లబ్ధి చేకూరాలన్నారు.  ఇతర రాష్ట్రాల రైతులకు వెళ్లకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

మాగనూర్, గుడేబల్లూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.  ఎలక్ట్రానిక్  కాంటాలు, గన్నీ బస్తాలు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, మార్కెట్ కార్యదర్శి భారతి, ఎమ్మార్వోలు సురేశ్, దయాకర్ రెడ్డి  ఉన్నారు.