నారాయణపేట, వెలుగు: భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లో ఆమె శనివారం సమీక్ష జరిపారు.
జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన పునరావాస కేంద్రాలైన మక్తల్ మండలంలోని అనుగొండలో భూసేకరణ ఎంతవరకు పూర్తయిందని ఆరా తీశారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ప్లాంటింగ్ పనులు ఏ దశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్ ఈ బాలరాజు, నారాయణ పేట, మక్తల్ ఈఈ లు బ్రహ్మానంద, సంజీవప్రసాద్ పాల్గొన్నారు. తరువాత కలెక్టర్ వైద్యారోగ్యశాఖ పై సమీక్షించారు.