సీజనల్​ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్  సిక్తా పట్నాయక్

సీజనల్​ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్  సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు : సీజనల్  వ్యాధులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్  సిక్తా పట్నాయక్  ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​ వీడియో కాన్ఫరెన్స్  హాల్​లో అడిషనల్​ కలెక్టర్ మయాంక్  మిత్తల్ తో కలిసి జిల్లా కో ఆర్డినేషన్  కమిటీ సమావేశం నిర్వహించారు. సీజనల్  వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లాలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పట్టణాల్లో డ్రైనేజీలు, రోడ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లల్లో వంట గదులు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. డీఎంహెచ్​వో సౌభాగ్య లక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్  రంజిత్, ప్రోగ్రాం ఆఫీసర్  రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్ : సీజనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగర్​కర్నూల్​ కలెక్టర్  బదావత్ సంతోష్  సూచించారు. బుధవారం కలెక్టరేట్  మీటింగ్ హాల్​లో అడిషనల్​ కలెక్టర్  శ్రీనివాసులుతో కలిసి రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశీలించి, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎక్కడైనా సీజనల్  వ్యాధులు ప్రబలితే వెంటనే అక్కడికి చేరుకొని వైద్యం అందించాలన్నారు. డీపీవో కృష్ణ, డీఆర్డీవో చిన్న ఓబులేసు పాల్గొన్నారు. 

పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి

వనపర్తి : మున్సిపాలిటీల పరిధిలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వనపర్తి కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్  సంచిత్  గంగ్వార్ తో కలిసి వనపర్తి, కొత్తకోట మున్సిపాలిటీల్లో పర్యటించి పారిశుధ్యాన్ని పరిశీలించారు. మెయిన్​ డ్రైనేజీలను ఎప్పటికప్పుడు క్లీన్​ చేయాలని, చెత్త సేకరణ పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్  కమీషనర్లను ఆదేశించారు. బీటీ రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వనపర్తి శ్రీనివాసపురం, కొత్తకోట పట్టణంలోని నర్సరీని కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట జడ్పీ సీఈవో యాదయ్య, మున్సిపల్​ కమిషనర్  పూర్ణ చందర్, ఇంజనీరింగ్  అధికారులు పాల్గొన్నారు.