డిజిటల్  లెర్నింగ్ పై అవగాహన పెంచుకోవాలి :  కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ 

డిజిటల్  లెర్నింగ్ పై అవగాహన పెంచుకోవాలి :  కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ 

నారాయణపేట, వెలుగు: విద్యార్ధులు డిజిటల్​ లెర్నింగ్​పై అవగాహన పెంచుకోవాలని నారాయణపేట కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ సూచించారు. గురువారం మండలంలోని జాజాపూర్  హైస్కూల్​లో 9వ తరగతి చదివే పిల్లలకు, డిజిటల్  లెర్నింగ్  శిక్షణ పొందిన విద్యార్థులు ఇస్తున్న ప్రెజెంటేషన్  చూసి వారిని కలెక్టర్  ప్రశంసించారు.

గూగుల్  టూల్స్, ఈ మెయిల్, వివిధ యాప్స్  వినియోగంతో స్కూల్  ప్రాజెక్టులు చేయడం బాగుందని, గ్రామీణ విద్యార్థులకు ఇలా డిజిటల్  వినియోగంపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. డిజిటల్  ఈక్విటీ సంస్థ ప్రతినిధి ఓంకార్, డిగ్రీ కాలేజీ సెంటర్  విద్యార్థులను అభినందించారు. అన్ని టాపిక్స్​పై ట్రైనింగ్​ తీసుకోవడం హర్షణీయమన్నారు. డీఈవో గోవిందరాజులు, ఎస్ వో సాగర్  పాల్గొన్నారు.