ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అన్ని వివరాలు నమోదు చేయాలి : సిక్తా పట్నాయక్  

 ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అన్ని వివరాలు నమోదు చేయాలి : సిక్తా పట్నాయక్  

మద్దూరు, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్ లో అన్ని వివరాలను నమోదు చేయాలని నారాయణపేట కలెక్టర్  సిక్తా పట్నాయక్  ఆదేశించారు. బుధవారం మద్దూరు మండలం పెదిరిపహాడ్ లో సర్వేను పరిశీలించారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దరఖాస్తుల వారీగా ఇండ్ల సర్వే చేయాలని సూచించారు. సర్వర్  సమస్యతో సర్వే ఆలస్యమవుతోందని సిబ్బంది కలెక్టర్  దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం, సాయంత్రం సమయంలో సర్వే చేస్తే ప్రజలు అందుబాటులో ఉంటారని, ఆ సమయంలో సర్వర్  సమస్య కూడా ఉండదని ఆమె చెప్పారు.

ఏమైనా అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. డాక్యుమెంట్లను పరిశీలించి వివరాలు నమోదు చేయాలన్నారు. మండల కేంద్రంలో కొందరు మహిళలు కలెక్టర్​ను కలిసి తమకు ఇంటి స్థలం ఇప్పించాలని కోరారు. అనంతరం కేజీబీవీని తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్  మహేశ్​గౌడ్, ఎంపీడీవో నరసింహారెడ్డి, ఏపీవో రామన్న పాల్గొన్నారు.