పోక్సో కేసులో నిందితుడికి 25 ఏండ్ల జైలు .. నారాయణపేట జిల్లా కోర్టు తీర్పు

పోక్సో కేసులో నిందితుడికి 25 ఏండ్ల జైలు .. నారాయణపేట జిల్లా కోర్టు తీర్పు

నారాయణపేట, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 25 ఏండ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ నారాయణపేట జిల్లా కోర్టు జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ గురువారం తీర్పు చెప్పారు.  ఎస్పీ యోగేశ్​గౌతమ్ తెలిపిన ప్రకారం.. నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికను పదో తరగతి చదువుతున్నప్పటి నుంచి కొల్లంపల్లికి చెందిన మండ్ల  బాలరాజు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అంతేకాకుండా గతేడాది జనవరి 17న కాలేజీకి వెళ్తున్న బాలికను బాలరాజు నమ్మించి భద్రాచలం తీసుకెళ్లి పెండ్లి చేసుకున్నాడు.

 అక్కడి నుంచి తిరుపతి తీసుకెళ్లి నాలుగు నెలలు పాటు లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలి తండ్రి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయగా.. సాక్షులను విచారించగా.. నేరం రుజువు కావడంతో నిందితుడి జైలు శిక్ష, జరిమానా  విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.