మరికల్/ధన్వాడ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత కీలకపాత్ర పోషించాలని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సూచించారు. మంగళవారం మరికల్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు పూసల్‌పహాడ్‌లో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సూర్యమోహన్‌రెడ్డి, బి వీరణ్ణ, గొల్ల కృష్ణయ్య, ఎల్ రాములు, మాజీ ఎంపీటీసీ గోపాల్, హరీశ్ చారి ఉన్నారు.
మరికల్ మండలం పూసల్‌పహాడ్, ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి గ్రామస్తులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. డీఆర్డీవో మొగులప్ప, ఎంపీడీవో కొండన్న, మార్కెట్ చైర్మన్ సదాశివారెడ్డి పాల్గొన్నారు.