కోల్కతా ఘటనలో ఆర్‌జీకర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై నార్కో పరీక్షలు..?

కోల్కతా ఘటనలో ఆర్‌జీకర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై నార్కో పరీక్షలు..?

కోల్‌కతాలో ఆగస్టు 9న జరిగిన పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి అందరికీ తెలిసందే. అయితే ఇప్పటికే ఈ సంఘటనలో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా  సిబిఐ ఆర్‌జి కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పాత్రపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా ఇటీవలే పోలీసులు సందీప్ ఘోష్ కి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. అయితే పాలిగ్రాఫ్ పరీక్షల రిపోర్టులు తారుమారు చేసేందుకు సందీప్ ఘోష్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టులలో హత్యాచారం సంఘటన జరిగిందని సందీప్ ఘోష్ కి సమాచారం అందినప్పటికీ వెంటనే హాస్పిటల్ కి వెళ్లకుండా నిర్లక్ష్యం వహించాడని, అంతేగాకుండా వైస్ ప్రిన్సిపాల్ (మెడికల్ సూపరింటెండెంట్), డాక్టర్ సుమిత్ రాయ్ తపదార్ ద్వారా ఒక సందిగ్ధ ఫిర్యాదు దాఖలైనట్లు విచారణలో తేలింది. 

అలాగే సంఘటన జరిగిన వెంటనే సందీప్ ఘోష్  ఫిర్యాదు చెయ్యకుండా జాప్యం చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇక ట్రైనీ డాక్టర్ మృతదేహం పోస్టుమార్టం విషయంలో కూడా పలు అవకతవకలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో హత్యాచార కేసులో రోజురోజుకు విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. దీంతో సందీప్ ఘోష్ కి నార్కో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి కావాలని సీబీఐ కోరింది.

అయితే ఇప్పటికే ఈ హత్యాచార కేసులో దాదాపుగా 10 మందికిపైగా సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వివిచారిస్తున్నారు. మరోవైపు హత్యాచార సంఘటన జరిగి ఇప్పటికే నెల రోజులు గడుస్తున్నపటికీ నిందులకి శిక్ష విధించే క్రమంలో న్యాయస్తానం జాప్యం చేస్తోందని ప్రజా సంఘాలు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.