గద్వాల జిల్లాలో 20 మందిపై కేసు నమోదు
గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలోని కల్లు షాపులపై నార్కోటిక్ దాడులు కలకలం రేపుతున్నాయి. శుక్ర, శనివారాల్లో దాడులు చేసి 20 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నార్కోటిక్ టీమ్స్ గద్వాల మండలం పూడూరు, వీరాపురం గ్రామాల్లోని కల్లు షాపుల్లో తనిఖీలు చేశారు.
గద్వాల పట్టణ పరిధిలోని జమ్మిచేడు, మల్దకల్ మండలం మద్దెలబండ కల్లు షాపుపై దాడులు చేసి కల్లు తాగిన వారిలో 20 మందిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారికి మూత్ర, రక్త పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడడంతో కేసులు నమోదు చేశారు.
గద్వాల మండలం వీరాపురం కల్లు షాపునకు సంబంధించి గౌని కృష్ణ, శ్రీనివాస్, కిశోర్, వీరేశ్ సాంబ, పూడూరు కల్లు షాపునకు సంబంధించి శ్రీధర్, తిరుమలేశ్, మధుసూదన్, గోవర్ధన్, శేఖర్, శంకర్, సురేందర్, గద్వాల పట్టణం జమ్మిచేడు కల్లు షాపునకు చెందిన ఎల్లా గౌడ్, అనసూయమ్మ, రామన్, మల్దకల్ మండలం మద్దెలబండ కల్లు షాపునకు చెందిన తిమ్మప్ప, వీరన్న, చంద్రన్న, శేఖర్, రాజుపై కేసులు నమోదు చేశారు.