ప్రైవేట్​ దవాఖానలో నార్కొటిక్ ​డ్రగ్స్!

  • హైదరాబాద్ లోని రెండు హాస్పిటళ్లలో  భారీగా నిల్వలు
  • ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసుల నమోదు

హైదరాబాద్ సిటీ, వెలుగు : చాంద్రాయణగుట్ట బకోబన్ హాస్పిటల్, వారాసిగూడ బౌద్ధనగర్ లోని బీవీకే రెడ్డి దవాఖానల్లో ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ (డీసీఏ)​ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. బకోబన్ హాస్పిటల్ లో 47, బీవీకే రెడ్డి దవాఖానలో 21 ఫెంటానిల్ ఇంజెక్షన్లు, 9 కేటామైన్, 2 మిడాజోలం ఇంజెక్షన్లతో సహా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాల భారీ నిల్వలను గుర్తించారు. రెండు హాస్పిటళ్లపై ఎన్డీపీఎస్​ యాక్ట్ కింద చార్మినార్, ముషీరాబాద్ ఎక్సైజ్​ పోలీస్​ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. కేసు విచారణ కొనసాగుతుందని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్​ లో చార్మినార్, సికింద్రాబాద్ డ్రగ్, ఎక్సైజ్ సీఐలు లక్ష్మీ, గోవింద్​సింగ్, శ్రీనివాసరావు, రామకృష్ణ, ఎస్ఐలు శ్వేతా కుమారి, ​ ప్రసన్న రెడ్డి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.