పహల్గాం బాధితులకు నివాళిగా నారెడ్కో క్యాండిల్ మార్చ్‌‌‌‌

పహల్గాం బాధితులకు నివాళిగా నారెడ్కో క్యాండిల్ మార్చ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  పహల్గాం ఉగ్రదాడి బాధితులకు గౌరవ నివాళిగా  నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌‌‌‌మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) తెలంగాణ, "ఇన్ గ్రీఫ్, ఇన్ రేజ్, ఇన్ సాలిడారిటీ" అనే శీర్షికతో  తాజాగా కొవ్వొత్తుల మార్చ్‌‌‌‌ను నిర్వహించింది. ఈ మార్చ్ కేబీఆర్‌‌‌‌‌‌‌‌  పార్క్ పార్కింగ్ లాట్ నుంచి  బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్  వరకు జరిగింది. 

ఈ శాంతియుత మార్చ్‌‌‌‌లో జూబ్లీ హిల్స్ నివాసితులు, నారెడ్కో తెలంగాణ సభ్యులు,  సిబ్బంది హృదయపూర్వకంగా పాల్గొన్నారు. నారెడ్కో  తెలంగాణ అధ్యక్షుడు  విజయ సాయి మేక,  ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు కాళీ ప్రసాద్ డమెర,  లయన్ వై కిరణ్, నారెడ్కో తెలంగాణ జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి,  ట్రెజరర్ ఆర్‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్వర రావు, ఇతర సీనియర్ సభ్యులు 
హాజరయ్యారు..