హైదరాబాద్, వెలుగు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవెలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ‘‘తెలంగాణ ప్రాపర్టీ షో 2024” 14వ ఎడిషన్ హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 2024 అక్టోబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు జరగనుంది. అన్ని రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా నివాస, కార్యాలయ, వాణిజ్య, రిటైల్ స్థలాలతో సహా అనేక రకాల ప్రాపర్టీలను ఇక్కడ ప్రదర్శిస్తారు.
డెవలపర్లు, ప్రమోటర్లు, బిల్డర్లు ఒకేవేదికపైకి తీసుకురావడానికి ఈ షో ఉపయోగపడుతుందని నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ మేకా విజయసాయి రెడ్డి చెప్పారు. హైడ్రా గురించి భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ, అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు ఏమీ కాదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు. కస్టమర్లు నిర్భయంగా ప్రాపర్టీలను కొనొచ్చని స్పష్టం చేశారు.