- ‘కరీంనగర్’ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
- కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి
- ప్రకటించిన హైకమాండ్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు తీవ్రంగా పోటీ పడినప్పటికీ ఆయనకే టికెట్ దక్కింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసే ఉద్దేశంతో నరేందర్రెడ్డి నాలుగు నెలలుగా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో తిరుగుతూ పట్టభద్రులను కలుస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 1.5 లక్షల ఓట్లను ఎన్ రోల్ చేయించినట్టు ఆయన చెప్తున్నారు. 2018లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే అప్పుడు టికెట్ దక్కలేదు. ప్రస్తుత గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించడంతో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు.