![విద్యారంగ సమస్యలపై కృషి చేస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/narender-reddy-wants-to-win-graduate-mlc-elections-with-a-huge-majority_ZTp6vbqwCt.jpg)
హుజూరాబాద్ రూరల్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోరారు. ఆదివారం హుజూరాబాద్‌లోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి మండలికి పంపేందుకు గ్రాడ్యుయేట్లు సిద్ధంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి
కోరుట్ల,వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు.ఆదివారం రాత్రి కోరుట్లలోని జీఎస్ గార్డెన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాక సమావేశం నిర్వహించారు.