Team India: ప్రధానితో ముగిసిన సమావేశం.. ముంబై బయలుదేరిన భారత జట్టు

Team India: ప్రధానితో ముగిసిన సమావేశం.. ముంబై బయలుదేరిన భారత జట్టు

17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవడంతో దేశంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఢిల్లీలో అభిమానులు భారత క్రికెట్ జట్టుకు గ్రాండ్ గా స్వాగతం పలికారు. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న టీమిండియా జట్టు ఐటీసీ మౌర్య హోటల్‌లో ప్రత్యేకంగా కేక్‌ కటింగ్‌ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీని భారత క్రికెటర్లు కలిశారు. 

కొన్ని నిమిషాల క్రితం ప్రధాని నరేంద్ర మోడీతో భారత క్రికెటర్ల సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఆటగాళ్లతో మోడీ సంభాషించారు. టీ20 ప్రపంచకప్ సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశం అనంతరం భారత క్రికెట్ జట్టు ఐటిసి  మౌర్యకు తిరిగి వెళ్తారు. అక్కడ నుంచి టీమిండియా ముంబై వెళ్ళడానికి స్పెషల్ బస్ ను ఏర్పాటు చేశారు. ఈ బస్ పై 2024  ఛాంపియన్స్ అని రాసి ఉంది. సాయంత్రం 5 గంటలకు బీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే టి20 విక్టరీ పరేడ్ లో భారత క్రికెటర్లు పాల్గొననున్నారు.

ఈ విజయోత్సవ ర్యాలీ నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు సాగనుంది. ఈ విక్టరీ పరేడ్ అనంతరం భారత  క్రికెటర్లను బీసీసీఐ సన్మానించనుంది. ఈ కార్యక్రమానికి క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని జై షా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వాంఖడే స్టేడియానికి విచ్చేసే అభిమానులకు లోపలకి ఉచిత ప్రవేశం కల్పించారు.