కొత్తపల్లి, వెలుగు : దుర్గామాత నవరాత్రుల సందర్భంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలోని శ్రీ శక్తి యూత్ ఏర్పాటు చేసిన మండపం వద్ద తీసిన వినూత్న లక్కీ డ్రాలో ఊహించని పరిణామం జరిగింది. మండప నిర్వాహకులు అమ్మవారి పేరుతో ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో ప్రధాని మోదీ పేరిట ప్రశాంత్అనే భక్తుడు రూ.20 తో కూపన్ కొనుగోలు చేశాడు.
ఆదివారం తీసిన డ్రాలో అనూహ్యంగా ప్రధాని మోదీ పేరుతో ఉన్న కూపన్ రెండో బహుమతిగా ఎంపికైంది. ఎల్లమ్మ తల్లి పేరిట మరో భక్తుడు కూపన్ కొనుగోలు చేయగా.. ఫస్ట్ ప్రైజ్ కింద కూలర్ వచ్చింది. దీంతో నిర్వాహకులు భక్తులకు బహుమతులు అందజేశారు.