- కాంగ్రెస్ గ్రాడ్యుయేట్‌ఎమ్మెల్సీ క్యాండిడేట్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్, వెలుగు : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను గెలిచి సోనియా గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డికి గిఫ్ట్‌గా ఇస్తానని కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్‌రెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన ఢిల్లీ పెద్దలకు, రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానన్నారు.
ఈ ఎన్నికను సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, తాను తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా ఎమ్మెల్సీ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించానని, ఈ టైంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో లా కాలేజ్‌తో పాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, కాశిరెడ్డి శ్రీనివాస్, శ్రావణ్‌నాయక్, మునిగంటి అనిల్ పాల్గొన్నారు.