బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్‌‌గా నరేందర్‌‌‌‌రెడ్డి

బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్‌‌గా నరేందర్‌‌‌‌రెడ్డి

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ గా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌‌‌‌రెడ్డి ఎన్నికయ్యారు. బుధవారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఈ సందర్భంగా నరేందర్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో ఉత్తర తెలంగాణ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు.

రాష్ట్రంలోనే కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ను నంబర్‌‌‌‌ వన్ స్థానంలోకి తీసుకువచ్చేందుకు  కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రభాకర్, రాజేందర్, జాయింట్ సెక్రటరీలు కందుకూరి శంకర్, సంధి రాజిరెడ్డి, సభ్యులు శివశంకర్, రాజ్ కుమార్, రమేశ్, నరేశ్, సంపత్, పవన్ కుమార్, భాస్కర్ రావు, పాల్గొన్నారు.